సల్మాన్ మెయిట్ టార్గెట్..లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్ట్ లో ఎవరు ఉన్నారంటే..!

Lawrence Bishnoi Hit List.. 

మాజీ మంత్రి ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన సంగతి తెలిసిందే.. ముంబైలోని ఆయన కార్యాలయం వెలుపల ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ లను పోలీసులు వెంటనే అరెస్టు చేయగా మరో నిందితుడు, కుట్రదారుడు ప్రవీణ్ లోంకర్‌ను ఆదివారం అరెస్టు చేశారు. ప్రవీణ్ లోంకర్ సోదరుడు శుభమ్‌కు జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో లారెన్స్ బిష్ణోయ్ పేరు మరోసారి చర్చకు వచ్చింది.

బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్నాడు. అయితే అతడు కొందరు ప్రముఖులను చంపేందుకు హిట్ లిస్ట్ తయారు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎన్ఐఏ ముందు అంగీకరించాడు. ఈ హిట్ లిస్ట్ ముందు సల్మాన్ ఖాన్ ఉన్నారు. బిష్ణోయ్ మెయిన్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అంట.. మిగిలిన వారి పేర్లను కూడా బిష్ణోయ్ రివీల్ చేశాడు. అయితే బాబా సిద్ధిఖీ సల్మాన్ ఖాన్‌కు సన్నిహితుడు కాబట్టే ఆయనను హత్య చేసినట్లు వెల్లడైంది. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌లో ఉండటంతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి.

సల్మాన్ ఖాన్ ఎందుకు టార్గెట్?

లారెన్స్ బిష్ణోయ్ సమాజం కృష్ణ జింకలను పవిత్రంగా భావించి ఆరాధిస్తుంది. 1998లో ఓ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపిన సంగతి తెలిసిందే.. అందుకే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసినట్లు బిష్ణోయ్ ఎన్ఐఏ ముందు అంగీకరించాడు.   బిష్ణోయ్ ఆదేశాల మేరకు అతని అనుచరుడు సంపత్ నెహ్రా ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిని రెక్కీ చేశాడు. కానీ సంపత్ పట్టుబడటంతో ప్లాన్ విజయవంతం కాలేదు. ఈ ఏడాది ప్రారంభంలో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ కు భద్రతను పెంచారు.

బిష్ణోయ్ హిట్ లిస్ట్‌ ఎవరున్నారు?

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు 11 రాష్ట్రాల్లో నెట్ వర్క్ ఉండటంతో పాటు దేశవ్యాప్తంగా 700 మంది షూటర్లు ఉన్నారు.  ఈ గ్యాంగ్  ఇప్పటికే గాయకుడు సిద్ధూ మూస్ వాలాను హత్య చేసింది. మూస్ వాలా మేనేజర్ సగున్ ప్రీత్ సింగ్ కూడా బిష్ణోయ్ హిట్ లిస్ట్‌లో ఉన్నాడు. హిట్ లిస్ట్‌లో గ్యాంగ్ స్టర్ కౌశల్ చౌదరి కూడా ఉన్నాడు. బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ కూడా లిస్ట్ లో ఉన్నాడు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీ కూడా లిస్ట్ ఉన్నట్లు తెలిసింది.

Leave a Comment