పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలుసు.. ఆయన సినిమా ప్రయాణం నుంచి రాజకీయ ప్రయాణం వరకు అందరికీ తెలిసిందే.. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని ఇంట్రస్టింగ్ విషయాల గురించి ఆయన తల్లి అంజనాదేవి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇప్పటి వరకు ప్రజలకు తెలియని ఎన్నో విషయాలను ఆమె చెప్పారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసింద. అయితే పవన్ కి దీక్షలు కొత్త కాదని పవన్ కళ్యాణ్ అమ్మ అంజనాదేవి చెప్పారు. చిన్నప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అయ్యప్ప మాల వేసుకునేవాడని తెలిపారు. ప్రత్యేకంగా తన కోసమే పనవ్ దీక్ష తీసుకున్నాడని అన్నారు. పవన్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డాడని, అతని కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడని, ప్రజలకే సేవ చేసే భాగ్యాన్ని ప్రసాదించాడని అంజనాదేవి ఆనందంతో వెల్లడించారు.
అన్న ప్రాసన రోజు కత్తి పట్టుకున్నాడు..
పవన్ కళ్యాణ్ గురించి ఆయన తల్లి అంజనదేవి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. పవన్ కళ్యాణ్ అన్న ప్రాసన ఎలా జరిగిందో వివరించారు. తాము ఒకసారి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లామని, అప్పుడు పవన్ వయసు 6 నెలలు అని, అందుకు తిరుమలలోనే అన్న ప్రాసన చేద్దామని అనుకున్నామని చెప్పారు. తిరుమలలో యోగ నరసింహాస్వామి వద్ద పడుకోబెట్టి అన్న ప్రాసన చేద్దామని పవన్ తండ్రి వెంకట్రావును తాను అడిగానని తెలిపారు. ఆయన పోలీసు అవడం వల్ల ఆ రోజుల్లో ఆయన దగ్గర ఎప్పుడూ చిన్నపాటి కత్తి ఉండేదని, ఆ కత్తి, పెన్ను, పుస్తకాలు, దేవుడి ప్రసాదం పెట్టి పవన్ కు అన్నప్రాసన చేస్తే.. పవన్ ముందు కత్తి పట్టుకున్నాడని అంజనాదేవి గుర్తుచేసుకున్నారు. ఇక కత్తి పట్టుకున్నాడు కదా పిల్లాడు కోపిష్టి అవుతాడు లేదంటే పది మందికి మంచి చేసేవాడు అవుతాడు అని అప్పుడే మేము అనుకున్నాన్నారు. అన్నట్టుగానే పవన్ కళ్యాన్ ప్రజాసేవలో ఉన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతను చేస్తున్న పని చూసి చాలా సంతోషంగా ఉందని అంజనాదేవి అన్నారు.