నేను ఏ హీరోతో పోటీ పడను.. కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేేశారు. తాజాగా జరిగిన ఓ సభలో పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ముందు బాధ్యతలు ఆ తర్వాతే సినిమాలు అని స్పష్టం చేశారు. అభిమానులు ఓజీ..ఓజీ అంటే.. తనకు మోదీ.. మోదీ అని వినబడేదని తెలిపారు. ముందు కడుపు నిండే పనిచేద్దామని అన్నారు. ఆ తర్వాత సినిమా, రోడ్లు, స్కూల్స్ బాగు చేసుకుందామని తెలిపారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలని, టికెట్ కొనాలంటే డబ్బులు ఉండాలని అన్నారు. అందుకే గ్రామాల్లో అభివ్రుద్ధి చేసుకోవాలని, ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీని కోసం రాష్ట్రంలో డబ్బు ఉండాలన్నారు. 

టాలీవుడ్ లో తనకు ఏ హీరోతోనూ పోటీ లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. హీరోల్లో ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో నిష్ణాతులుగా ఉన్నారన్నారు. బాలక్రిష్ణ, చిరంజీవి, మహేశ్ బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని ఇలా అందరు హీరోలు బాగుండాలని తెలిపారు. మీ అభిమాన హీరోలకు జై కొట్టాలంటే ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందుకే ఆర్థిక వ్యవస్థపై ముందు దృష్టి పెడదాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల ప్రారంభోత్సవంలో పవన్ పాల్గొన్నారు. పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కంపౌండ్ వాల్స్, పాఠశాలల్లో రూఫ్ టాప్స్ ఇలా 30 వేల అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సంవత్సరానికి రూ.10 వేల కోట్లు ఉపాధి హామీ నిధులు వస్తాయని పవన్ తెలిపారు.

  

 

 

Leave a Comment