ఏపీ డీఎస్సీకి ఫ్రీ కోచింగ్..జన్మభూమిలో ఆన్ లైన్ దరఖాస్తులు..!

AP DSC Free Coaching:  అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉచిత శిక్షణకు ఎంపికైన డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింత్, ఉచిత భోజనంతోపాటు వసతి సౌకర్యాలను కల్పించనుంది. ఆంధ్రప్రదేశ్​లోని ఆయా జిల్లాల్లో అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో మూడు నెల‌ల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఉంటుంది. దీనికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అక్టోబ‌ర్ 21లోపు జ్ఞానభూమి వెబ్‌పోర్టల్ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. మెగా డీఎస్సీ 2024-25గాను ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ మొత్తం 5 వేల 50 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050, ఎస్టీలకు 2 వేల సీట్లు కేటాయించారు. 

వివరాలు:

అర్హత : ఎస్జీటీ ఉచిత శిక్షణకు ఇంటర్, డీఈడీ, టెట్, స్కూల్​ అసిస్టెంట్​ కోచింగ్​కు డిగ్రీ, బీఈడీ, టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపికైన అభ్యర్థుల వార్షికాదాయం రూ.2.5 లక్షల లోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : స్క్రీనింగ్ టెస్ట్, టెట్ స్కోర్, సర్టిఫికెట్స్​ వెరిఫికేషన్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 85 శాతం, టెట్​ స్కోరుకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్​లైన దరఖాస్తు ప్రారంభం 11-10-2024.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 21-10-2024
  • హాల్ టికెట్ డౌన్ లోడ్: 22-10-2024 నుంచి 25-10-2024 వరకు
  • స్క్రీనింగ్​ టెస్ట్​ తేదీ : 27-10-2024.
  • జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి: 28-10-2024.
  • జిల్లాల వారీగా తుది ఎంపిక జాబితా వెల్లడి: 30-10-2024.
  • శిక్షణ కేంద్రాల వారీగా అభ్యర్థుల కేటాయింపు: 03-11-2024.
  • ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం : 11-11-2024

పూర్తి వివరాలకు  https://jnanabhumi.ap.gov.in/ వెబ్ సైట్ ని సందర్శించండి..

 

Leave a Comment