ఏపీలో మద్యం ధరల వివరాలు  ఇవే..!

ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాల్లో విక్రయాలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల్లో మద్యం అమ్మకాలను ప్రారంభించారు. కూటమి ప్రభత్వం కొలువు తీరిన తర్వాత పాత మద్యం పాలసీ స్థానంలో కొత్త మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో 3,396 మద్య దుకాణాలకు 89,882 దరఖాస్తులు రాగా, లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేేశారు. మద్యం ధరలు తగ్గాయనుకుని దుకాణాలకు వస్తున్న వారికి నిరాశ, భంగపాటు తప్పలేదు. మద్యం ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో పలు చోట్ల విక్రేతలతో వాగ్వాదానికి దిగారు. రూ.99 మద్యం కూడా చాలా చోట్ల అందుబాటులోకి రాలేదు. రూ.120కనీస ధర ఉన్న రకమే చాలా చోట్ల విక్రయించారు. ఇక ధరలను చూస్తే..

విస్కీ బ్రాండెడ్ సెగ్మెంట్..

  • హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎంఎల్ – రూ.130
  • 750 ఎంఎల్ -రూ.750
  • నేవీ బ్లూ క్లాసిక్ విస్కీ 180 ఎంఎల్ – రూ.150
  • ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ 750 ఎంఎల్ – 490
  • బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 750 ఎంఎల్ – రూ.2500
  • బ్లెండెడ్ స్కాచ్ విస్కీ 350 ఎంఎల్ – రూ.1250

బ్రాండీ సెక్షన్..

  • కైరోన్ రేర్ బ్రాండీ 180 ఎంఎల్ – రూ.300
  • నెపోలియన్ సెయింట్ బ్రాండ్ విస్కీ 750 ఎంఎల్ – రూ.1180

రమ్ సెక్షన్..

  • ఓల్డ్ మంక్ స్పెషల్ xxx రేర్ రమ్ 180 ఎంఎల్ – రూ.230
  • బకార్డి లైమన్ అల్ట్రా ప్లాటినమ్ ఒరిజనల్ సిట్రస్ రమ్ 750 ఎంఎల్ – రూ.1,320

వోడ్కా సెగ్మెంట్..

  • మ్యాజిక్ మూమెంట్స్ గ్రీన్ ఆపిల్ ప్రీమియమ్ ఫ్లేవరడ్ 180 ఎంఎల్ – రూ.230
  • జూనో సూపీరియర్ పింక్ వోడ్కా 750 ఎంఎల్ – రూ.1030

వైన్ సెగ్మెంట్..

  • ఫ్రాతెల్లి షిరాజ్ 180 ఎంఎల్ – రూ.410
  • జిన్ 750 ఎంఎల్ – రూ.2250
  • బ్రీజన్ ప్లాటినమ్ టాంగీ క్రాన్ బెర్రీ – రూ.130

కింగ్ ఫిషర్, నాగ్ ఔట్ బ్రాండ్స్ అన్ని రూ.180 నుంచి రూ.270 వరకు ఉన్నాయి. మిగితా ధరల వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూడండి..  

MRP RATES IN ANDHRA PRADESH FOR THE YEAR 2024-26

 

Leave a Comment