దసరా, సంక్రాంతి పండుగల సమయంలో సినిమాలకు ఉండే క్రేజే వేరు.. ముఖ్యంగా పెద్ద హీరోల సినమాలు ఈ సీజన్ లోనే ఎక్కువగా విడుదల అవుతాయి. ముఖ్యంగా దసరా సమయంలో థియేటర్లలో సినిమాల జాతర ఉంటుంది. ఈ ఏడాది కూడా సినిమాల జాతర ఉండనుంది. ఈ ఏడాది దసరాకు మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో కొన్ని తెలుగు సినిమాలు కాగా.. మరికొన్ని తమిళం, హిందీ కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు రిలీజ్ కానున్నాయి. మరి ఈ దసరాకు వచ్చే సినిమాలు ఏంటో చూద్దామా..
ఈ దసరాకు వచ్చే సినిమాలు ఇవే..
2024 Dussehra Movies
విశ్వం(Viswam Movie)..
హీరో గోపీచంద్ నటించిన మూవీ విశ్వం(Viswam Movie) ఈ సినిమాకు దసరాకు రిలీజ్ కానుంది.. డైరెక్టర్ శ్రీనువైట్ల చాలా రోజుల తీసిన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా శ్రీనువైట్ల తన మార్క్ కామెడీ, యాక్షన్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మూవీ శుక్రవారం (అక్టోబర్ 11) రిలీజ్ కానుంది.
వేట్టయన్ (Rajinikanth vettaiyan Movie)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన మూవీ వేట్టయన్(vettaiyan Movie). ఈ సినిమా గురువారమే (అక్టోబర్ 10) థియేటర్లలోకి వస్తోంది. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
జనక అయితే గనక
సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ సినిమా శనివారం (అక్టోబర్ 12) రిలీజ్ కానుంది. నిజానికి ఈ సినిమా గత నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఏపీ, తెలంగాణ వరదలు రావడంతో వాయిదా పడి.. ఇప్పుడు రిలీజ్ కానుంది.
మా నాన్న సూపర్ హీరో
సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ అక్టోబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. గతేడాది హంట్, ఈ ఏడాది హరోమ్ హర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా సక్సెస్ సాధించలేకపోయిన సుధీర్ బాబు.. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
మార్టిన్
కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా నటించిన మూవీ మార్టిన్ శుక్రవారం (అక్టోబర్ 11) రిలీజ్ కాబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది. దీంతో తెలుగులోనూ వస్తోంది.
జిగ్రా(Jigra)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన జిగ్రా కూడా శుక్రవారమే (అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు
నార్నె నితిన్ నటించిన మూవీ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ గురువారం (అక్టోబర్ 10) రిలీజ్ అవుతోంది. సతీష్ వేగేష్న డైరెక్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ దసరా బరిలో పలు పెద్ద సినిమాలతో పోటీ పడుతోంది.